ఎల్లారెడ్డి పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా ఎ. రాజేష్ ను నియమించినట్లు కామారెడ్డి జిల్లా బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారి, ప్రభాకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన రాజేష్ మాట్లాడుతూ. తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు.