ఎల్లారెడ్డి జడ్పి బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం ఆర్డీఓ మన్నె ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన తయారీకి ఉపయోగించే వంట సామాగ్రి, బియ్యం తదితర వస్తువులను నిలువ ఉంచే గదిని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్డును ఇవ్వాల్సి ఉండగా ఇవ్వక పోవడంపట్ల బోజన ఏజన్సీ నిర్వహకునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.