ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాజుకుసత్కారం

1చూసినవారు
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాజుకుసత్కారం
ఢిల్లీలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నాగిరెడ్దిపేట్ మండలం తాండూరుకు చెందిన కమ్మరి రాజు, ప్రధానమంత్రి శ్రమ యోగి మందన్ యోజన పథకం కింద విశిష్ట అతిథిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ఏకైక వ్యక్తిగా ఎంపికయ్యారు. వేడుకలు ముగించుకుని స్వగ్రామం తాండూరుకు తిరిగి వచ్చిన ఆయనను గ్రామ సర్పంచ్ భూమయాదవ్ గౌడ్, ఉప సర్పంచ్ సన్నీ, యువకులు బుధవారం శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూమా యాద గౌడ్, కమ్మరి రాజు ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్