కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో బుధవారం, నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటల సాగు కోసం ప్రధాన కాల్వకు నీటిని విడుదల చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. సాగునీరు అందుబాటులోకి రావడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు.