ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 2వ వార్డు పరిధిలోని ప్రియాటాకీస్ ప్రాంతంలో చెట్లు విద్యుత్ స్తంభాలకు ఆనుకుని పెరగడంతో వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సమస్యపై వెంటనే స్పందించిన 2వ వార్డు కౌన్సిలర్ మంచిర్యాల మహేశ్వరి విద్యాసాగర్ అధికారులతో మాట్లాడారు. విద్యుత్ లైన్‌మెన్ శశికాంత్ రెడ్డి జేసీబీ సహాయంతో పిచ్చి మొక్కలను తొలగించి, విరిగిన స్తంభాలను సరిచేసి, కొత్త వైర్లతో విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల విద్యాసాగర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.