రిటైర్డ్ హెచ్ ఎమ్. కేపీ జైపాల్ మృతి

ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కేపీ. జైపాల్ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు సీఎస్ఐ సమాధుల స్థలంలో అంత్యక్రియలు జరగనున్నాయి. మెదక్ చర్చి సీఎస్ఐ మినిస్ట్రీయల్ బోర్డు కన్వీనర్ అండ్రుస్ ప్రేమ్ సుకుమార్, లే సెక్రెటరీ పెద్ది దేవసాయం, సీఎస్ఐ డీసీసీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ సుజిత్ అంత్యక్రియలకు హాజరు కానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎల్లారెడ్డి సీఎస్ఐ ప్రెస్ బీటర్ ఇంచార్జీ ఎర్రోళ్ల ప్రభాకర్, సంఘ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన విద్యాబోధనతో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు.
