
రేపు ఏపీలో పలు జిల్లాలో వర్షాలు
దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా, రేపు ఆంధ్రప్రదేశ్ లోని మన్యం, అల్లూరి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో వాతావరణం మారనుంది.




