గాంధారి మండల కేంద్రంలో శుక్రవారం రెండు బైక్‌లు ఢీకొన్నాయి. పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన విఠల్ రావు పెట్రోల్ బంక్ వైపు వెళుతుండగా, భిక్నూర్ గ్రామానికి చెందిన రఘు అతివేగంతో వచ్చి అతడి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో విఠల్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.