పెట్రోల్ ట్యాంక్ కవర్ నుండి రూ. 2 లక్షల నగదు చోరీ: కేసు నమోదు

1చూసినవారు
పెట్రోల్ ట్యాంక్ కవర్ నుండి రూ. 2 లక్షల నగదు చోరీ: కేసు నమోదు
ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన అబ్దుల్ రషీద్ తన కుమార్తె పెళ్లి అవసరాల నిమిత్తం యూనియన్ బ్యాంక్ నుండి రూ. 3 లక్షలు డ్రా చేసుకుని, వాటిని బైక్ ట్యాంక్ కవర్‌లో పెట్టుకుని ఇంటికి బయలుదేరారు. దేవునిపల్లి గేట్ వద్ద కారం పొడి కొనుగోలు చేయడానికి బైక్ ఆపి దుకాణంలోకి వెళ్లి తిరిగి వచ్చేసరికి, ట్యాంక్ కవర్ లోంచి రూ. 2 లక్షలు చోరీకి గురైనట్లు బాధితుడు ఎస్ఐ బొజ్జ మహేష్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్