కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మ ఆలయంలో బుధవారం, దోమకొండ గ్రామపంచాయతీ నూతన పాలకవర్గాన్ని దోమకొండ మండల ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. సర్పంచ్ ఐ. నరసయ్య, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, 16 మంది వార్డు సభ్యులకు ఈ సన్మానం జరిగింది. దోమకొండ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి తమ తోడ్పాటును అందిస్తామని, అతి పెద్ద మేజర్ పంచాయతీ అయిన దోమకొండను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు.