తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి కష్టాలు మొదలయ్యాయని పురుష ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్సుల నిర్వహణ సరిగా లేకపోవడం, టైర్లు పేలిపోవడం, సెల్ఫ్ స్టార్ట్ కాకపోవడంతో ప్రయాణికులే బస్సులను తోయాల్సిన దుస్థితి ఏర్పడింది. శనివారం ఉదయం బాన్సువాడ డిపో బస్సు సెల్ఫ్ స్టార్ట్ కాకపోవడంతో ప్రయాణికులు బస్సును తోయాల్సి వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నప్పుడు, బస్సుల నిర్వహణ పట్ల కూడా నిర్లక్ష్యం చూపకుండా చూడాలని పురుష ప్రయాణికులు కోరుతున్నారు.