ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మర్కల్ గ్రామం మాజీ సర్పంచ్ జుకంటి సంగారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన అకాల మృతికి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ కామారెడ్డి జిల్లా కన్వీనర్ గీరెడ్డి మహేందర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరారు. మండల కాంగ్రెస్ పార్టీ ఓ మంచి నాయకున్ని కోల్పోయిందని ఆయన అన్నారు.