నిజాంసాగర్లో సద్దుల బతుకమ్మ పండగను మహిళలు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుపుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తెలిపారు. ఈనెల 30న జరుపుకోనున్న పండుగ కోసం, బతుకమ్మ ఆడే స్థలాన్ని ట్రాక్టర్ సహాయంతో శుభ్రం చేయించారని, నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను విడుదల చేయడంతో నీటి ప్రవాహం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించి, బతుకమ్మల నిమజ్జనానికి అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన ఆదివారం పేర్కొన్నారు.