కామారెడ్డి జిల్లాకు చెందిన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జిల్లా అధ్యక్షులు కోడిప్యాక సాయిరాంకు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదోన్నతి లభించింది. ఈ నియామక ఉత్తర్వులను కమిటీ జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్ సోమవారం జారీ చేశారు. సాయిరాం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూనే జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.