ఎమ్మెల్యేని కలిసిన సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు

16చూసినవారు
ఎమ్మెల్యేని కలిసిన సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన పట్లోల్ల చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలో జరిగింది.

సంబంధిత పోస్ట్