మాజీ ఎమ్మెల్యేకు అయ్యప్ప ప్రసాదం అందించిన సర్పంచ్

1చూసినవారు
మాజీ ఎమ్మెల్యేకు అయ్యప్ప ప్రసాదం అందించిన సర్పంచ్
ఎల్లారెడ్డి సెగ్మెంట్ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను ఆదివారం నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట్ మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ వంశీ కృష్ణాగౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అయ్యప్ప మాలలో ఉన్న వంశీ కృష్ణాగౌడ్, దీక్ష పూర్తి చేసుకుని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుని, అక్కడి నుండి ప్రసాదాలు, అయ్యప్ప స్వామి చిత్రపటాన్ని తీసుకువచ్చి మాజీ ఎమ్మెల్యేను సత్కరించారు. వంశీ కృష్ణాగౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్