స్థానిక ఆర్డిఓ పార్థసింహారెడ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచులకు గ్రామాలను అభివృద్ధి చేసి ప్రజల మనసులు గెలుచుకోవాలని దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన పరిచయ కార్యక్రమంలో ఆర్డీఓ మాట్లాడుతూ, సర్పంచులు తమ విధులు, అధికారాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలని సూచించారు. ప్రజలతో మమేకమై గ్రామ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.