సేవ్ ఎల్లారెడ్డి మా నినాదం... 200కోట్లతో అభివృద్ధి చేశాం

0చూసినవారు
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ, 'సేవ్ ఎల్లారెడ్డి' అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ప్రజలను ఓటేసి గెలిపించాలని కోరతారని తెలిపారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని తన ఫామ్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో సుమారు 200 కోట్లతో పనులు జరిగాయని, 19 కోట్ల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, 5.50 కోట్లతో బస్టాండ్, 30 పడకల ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచడానికి 19 కోట్ల రూపాయల నిధులతో పనులు ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పనులు పూర్తి చేయలేని స్థితిలో ఉందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్