నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జానకంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనసూయ గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల ఇండ్ల వద్దకు వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ బడిలో చదువుపిస్తే కలిగే లాభాలను వివరించారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే మేలని, ఇక్కడ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని ఆమె తెలిపారు.