కుంట చెరువులో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు

1330చూసినవారు
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోసానిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం కుంట చెరువులో చేపల వేటకు వెళ్లిన గూల సాయిలు(65) గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసుల పర్యవేక్షణలో ఫైర్ సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అతని ఆచూకీ కోసం ముమ్మరంగా అన్వేషణ జరుగుతోంది. రాత్రి కావడంతో గాలింపు నిలిపివేశారు. రేపు ఉదయం 6 గంటలకు గాలింపు మొదలవుతుంది. కుంట గట్టుపై బట్టలు, చెప్పులు ఉండటంతోనే చెరువులో గాలింపు మొదలుపెట్టారు.

సంబంధిత పోస్ట్