గుండెపోటుతో సీనియర్ పాత్రికేయుడు అమీర్ హుస్సేన్ హబీబ్ మృతి

2చూసినవారు
గుండెపోటుతో సీనియర్ పాత్రికేయుడు అమీర్ హుస్సేన్ హబీబ్ మృతి
సాజ్-ఎ-డెక్కన్ ఉర్దూ డైలీతో అనుబంధం ఉన్న సీనియర్ పాత్రికేయుడు అమీర్ హుస్సేన్ హబీబ్ మంగళవారం గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి మీడియా రంగంలో, పాఠకులలో తీవ్ర దుఃఖాన్ని నింపింది. సామాజిక సమస్యలపై నిరంతరం వార్తలు రాసే హబీబ్ మృతి పట్ల టీజేఏ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్, ఎన్ యు జే (ఐ) జాతీయ ఉపాధ్యక్షులు రాజేందర్ నాథ్, టీ జే ఏ రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఖాసీం, కోశాధికారి ఖలీల్ అహమద్, కార్యదర్శి గౌరీ సంతాపం తెలిపారు. హబీబ్ కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.