గుండెపోటుతో ఎల్లారెడ్డి సీనియర్ న్యాయవాది మృతి

443చూసినవారు
గుండెపోటుతో ఎల్లారెడ్డి సీనియర్ న్యాయవాది మృతి
ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది లక్ష్మయ్య (92) గుండెపోటుతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సీపీఆర్ చేసినా ఫలితం లేదని ఆయన కుమారుడు శివకుమార్ తెలిపారు. శివకుమార్ కామారెడ్డి కలెక్టరేట్లో స్టాటిస్టికల్ అధికారిగా పనిచేస్తున్నారు. లక్ష్మయ్య ఎల్లారెడ్డి కోర్టులో సుదీర్ఘకాలం న్యాయవాద వృత్తి చేపట్టి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయనకు ఒక కూతురు, నలుగురు కొడుకులు ఉన్నారు. అంత్యక్రియలు మంగళవారం ఉదయం నాగిరెడ్డిపేట మండలం చీనూర్ గ్రామంలో నిర్వహించనున్నట్లు కుమారుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్