కామారెడ్డి జిల్లా సీనియర్
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదిలాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం, ఆయన ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు,
కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.