కామారెడ్డి జిల్లా
కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ శనివారం బెంగళూరు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కామారెడ్డి
కాంగ్రెస్ లో షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య తీవ్ర గ్రూపు
రాజకీయాలు, మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో, అలాగే ఏఐసీసీ షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిద్దరి భేటీ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.