శెట్పల్లిలో వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి

0చూసినవారు
శెట్పల్లిలో వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన 65 ఏళ్ల గొర్రెల కాపరి కందూరి సాయన్న శుక్రవారం వడదెబ్బతో మృతి చెందారు. మూడు రోజులుగా ఎండలో గొర్రెలను మేపడానికి వెళ్లిన సాయన్న, ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుప్పకూలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏఎన్ఎం రాధిక, జీపీఓ అలీ సాయన్న మృతిని ధృవీకరించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్