గంజాయి తరలిస్తున్న వ్యక్తులను తనిఖీ చేస్తున్న క్రమంలో కారు ఢీకొని తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రభుత్వం సౌమ్య కుటుంబానికి తక్షణ సహాయంగా రూ. 10 లక్షలు మంజూరు చేసింది. మొదట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది, పరిస్థితి విషమించడంతో నిమ్స్ కు తరలించారు.