పోలీస్ వాహనాల పార్కింగ్ షెడ్డును ప్రారంభించిన ఎస్పీ

4చూసినవారు
పోలీస్ వాహనాల పార్కింగ్ షెడ్డును ప్రారంభించిన ఎస్పీ
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలోని వాహన విభాగంలో నూతనంగా నిర్మించిన వాహనాల పార్కింగ్ షెడ్డును ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం ప్రారంభించారు. పోలీస్ వాహనాలు ఎల్లవేళలా సిద్ధంగా, క్రమబద్ధంగా నిలిపి ఉంచడానికి, వర్షం, ఎండ వంటి వాతావరణ ప్రభావాల నుండి భద్రత కల్పించడానికి ఈ షెడ్డును నిర్మించినట్లు ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖ సమర్థవంతంగా సేవలందించడంలో వాహనాల భద్రత కీలకమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్