సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ

843చూసినవారు
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, మనోభావాలు కించపరిచే పోస్టులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురువారం కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి, పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి టౌన్ సీఐ నరహరి కూడా ఎస్పీ వెంట ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్