శరీరదారుడ్యానికి ఆటలు ఎంతో దోహదం చేస్తాయని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ సాయిబాబా అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి మండలం బిక్కనూర్లో మండల స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. గెలుపు ఓటములను స్పోర్టివ్ గా తీసుకోవాలని క్రీడాకారులకు సూచించారు. ఈ సందర్భంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్న కీ.శే. మాదాసు సాయగౌడ్, కీ.శే. అరికెల శంకర్ కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు వాసవి గౌడ్, క్రీడాకారులు పాల్గొన్నారు.