ఎల్లారెడ్డి పట్టణంలోని త్రిశక్తి సర్వమంగళ సిద్ద దత్త పీఠంలో శ్రీ భగలాముఖి అమ్మవారి అష్టమి పూజ గురువారం అష్టమి తిథి రోజున ఘనంగా జరిగింది. జ్యోతిష్య పండితులు క్రాంతి పటేల్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం అమ్మవారికి అభిషేకాలు, పుష్పార్చనలు, పట్టు వస్త్రాల సమర్పణ, బగలమాలమంత్ర అభిషేకం, మహిళలచే లలితా సహస్ర నామ పారాయణాలు నిర్వహించారు. అమ్మవారికి విశేష అభిషేకం చేసి, పసుపును భక్తులకు ప్రసాదంగా అందించారు.