ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో వార్షికోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. పుణ్యవచన కార్యక్రమం, అమ్మవారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలకు గ్రామ పెద్ద గౌడు, సర్పంచ్ కొయ్యల వినోద రాజాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఆయన అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం మహిళలు సంప్రదాయ బోనాలను అలంకరించి, డప్పుల శబ్దాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో సాగింది.