తెలుగు సాహిత్యానికి కొత్త నడక నేర్పిన మహాకవి శ్రీ శ్రీ (శ్రీరంగం శ్రీనివాస్ రావు) అని, ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ 117వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్, సిబ్బంది శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.