లింగంపేట్లో నూతనంగా నిర్మించిన శ్రీ ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీ అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా పరివార దేవత, ధ్వజస్తంభ, స్వయంభూ దివ్య పదునెట్టాంబడి ప్రతిష్ట, సహస్ర కలశ మహా కుంభాభిషేకం, దివ్య మహా పడిపూజ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రవిగౌడ్ తెలిపారు. ఉదయం 6 గంటలకు గణపతి హోమం, 9 గంటలకు సుదర్శన హోమం, మధ్యాహ్నం 12 గంటలకు ధూపదీప హారతి, శ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య మహా సంస్థానం ఆచార్య బ్రహ్మశ్రీ ఉన్నికృష్ణన్ నంబూద్రి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ప్రాణప్రతిష్ట జరగనుంది.