తాడ్వాయిలో వింత... ఏంటి ఈ పసుపు చుక్కలు

2చూసినవారు
తాడ్వాయిలో వింత... ఏంటి ఈ పసుపు చుక్కలు
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలోని ఐదవ వార్డులో గత నెల రోజులుగా ఒకే కాలనీలోని 10 ఇళ్లకు పైగా ఆకాశం నుంచి పసుపు రంగు చుక్కలు రాలుతున్నాయి. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య ఈ ఘటన జరుగుతోంది. మొదట్లో పట్టించుకోని గ్రామస్తులు, రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆశ్చర్యపోతున్నారు. అధికారులు పరిశీలించినా కారణం అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం ఇది ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత పోస్ట్