కామారెడ్డి మున్సిపాలిటీపై ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు

2చూసినవారు
కామారెడ్డి మున్సిపాలిటీపై ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు
కామారెడ్డి మున్సిపాలిటీలో అక్రమ వసూళ్లు, పాలనా పరమైన అవకతవకలు జరుగుతున్నాయంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిర్దిష్ట గడువులోగా నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్. వై. గిరిని ఆదేశించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో టెండర్ల ప్రక్రియ, పారిశుద్ధ్య కార్మికుల నియామకాలు, హాజరు, వేతనాల చెల్లింపులు, సీసీ కెమెరాల ఏర్పాటు పనులు, వాటిలో ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల జోక్యంపై వచ్చిన ఆరోపణలను విచారించనున్నారు. పట్టణ ప్రణాళికా విభాగం నోటీసులు, కౌన్సిల్ సమావేశాల నిర్వహణ, తదితర వాటి పై విచారణ జరగనుంది.

సంబంధిత పోస్ట్