విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎల్లారెడ్డి ఎంపీడీఓ తహెరా బేగం సూచించారు. సీఎం కప్ మండల స్థాయి క్రీడలు శుక్రవారం మాచాపూర్ గ్రామంలో మూడవ రోజు నిర్వహించారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. క్రీడలతో శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసం పెరుగుతాయని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించాలని ఆమె అన్నారు.