తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పుట్టకొక్కుల పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా, సోమవారం ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ కాంగ్రెస్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కిష్టయ్య త్యాగాన్ని స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సాధనలో ప్రాణాలు త్యాగం చేసిన కిష్టయ్య అమరుడని, ప్రతీ తెలంగాణ వాసి ఆయనను గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు.