కాపర్ వైర్ చోరికి ప్రయత్నించి పట్టుబడిన నిందితులు

11చూసినవారు
కాపర్ వైర్ చోరికి ప్రయత్నించి పట్టుబడిన నిందితులు
కామారెడ్డి పట్టణం గొల్లవాడ సమీపంలో మంగళవారం రాత్రి కాపర్ వైర్ దొంగతనం ఘటన కలకలం రేపింది. అనుమానాస్పదంగా వెళ్తున్న నలుగురిని రాజేష్, వినోద్, అశోక్ అనే వ్యక్తులు ఆపి ప్రశ్నించగా, దుండగులు ఇనుపరాడు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, పారిపోవడానికి ప్రయత్నించిన ఇజాస్, వసీం, హజారుద్దీన్ లను అదుపులోకి తీసుకుని, కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you