ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీ భవనంలో ఈ నెల 10, 11 తేదీలలో స్నేహ కిశోర బాలికల సమ్మర్ క్యాంప్ జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, బాలికలకు సంబంధించిన వివిధ సామాజిక అంశాలపై కిశోర బాలికలు చర్చించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా నుంచి రేఖ,
సమంత, నైతిని, నవ్య పాల్గొన్నారు. వీరిలో నవ్యశ్రీ సోషల్ జస్టిస్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించగా, మిగిలిన బాలికలు పార్లమెంట్ సభ్యులుగా చర్చల్లో పాల్గొన్నారు. వీరిని కలెక్టర్ ఆశీష్ సంగ్వన్ సత్కరించారు.