ఎమ్మెల్యేను కలిసిన ఆలయ కమిటీ సభ్యులు

8చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన ఆలయ కమిటీ సభ్యులు
ఎల్లారెడ్డి మండలంలోని ఆత్మకూరు గ్రామ శ్రీశ్రీశ్రీ మరకత ఆత్మ లింగేశ్వర ఆలయ కమిటీ సభ్యులు గురువారం హైదరాబాద్‌లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును మర్యాదపూర్వకంగా కలిసి, ఆలయ గోడ నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఆలయ కమిటీ తరపున గడ్డం బాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రామ గౌడ్, నారాయణరెడ్డి, నర్సింలు, మధు తదితరులు ఎమ్మెల్యేను కలిశారు.

సంబంధిత పోస్ట్