ఎల్లారెడ్డి పట్టణంలోని మూడు పరీక్ష కేంద్రాలలో మంగళవారం పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా బయోలోజికల్ సైన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 240 మందికి గాను 239 మంది హాజరయ్యారని, ఒక విద్యార్థి గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఆర్డీఓ ప్రభాకర్, ఎంఈఓ ఎల్. రాజులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి, పకడ్బందీగా నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.