జనగణన–2027 తొలివిడతలో భాగంగా ఇండ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోళీకేరి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి కలెక్టర్లు, జనగణన అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ, ఇండ్ల గణనను కచ్చితంగా నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇస్తున్నామని, జిల్లాలో జనగణన–2027 తొలి విడత ఇండ్ల గణనను అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిర్వహిస్తామని తెలిపారు.