పోచారం గెస్ట్‌హౌస్‌కు పూర్వ వైభవం

13చూసినవారు
పోచారం గెస్ట్‌హౌస్‌కు పూర్వ వైభవం
కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలో పోచారం ప్రాజెక్టు గెస్ట్ హౌస్ రేట్రో ఫిట్టింగ్, ఆటస్థలం ఏర్పాటు ప్రతిపాదనలను బుధవారం ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, డిఈఈ కిష్టయ్య, కన్సల్టెంట్ లు ఇటీవల పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న గెస్ట్ హౌస్ను రెట్రో పిటింగ్ విధానంలో అభివృద్ధి చేయడం, ఆటస్థలం ఏర్పాటు వంటి పనులను పరిశీలించారు. పోచారం ప్రాజెక్టు అభివృద్ధి పనుల నిమిత్తం 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు కాగా, టూరిజం సంస్థకు అప్పజెప్పిన పనులను అభివృద్ధి ఎక్కువగా ఉండటంతో ట్రెడిషనల్ లివింగ్ కన్సల్టెంట్ వారికి అప్పజెప్పారు. త్వరలో అతిథి గృహానికి పూర్వ వైభవం రానుంది.

సంబంధిత పోస్ట్