జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు బుధవారం జుక్కల్, పిట్లం మండల కేంద్రాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. సమావేశం అనంతరం ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఎమ్మెల్యేని సత్కరించారు.