అర్హులైన ప్రతి పేదలకు నివాసం కల్పించడమే ప్రభుత్వ

6చూసినవారు
అర్హులైన ప్రతి పేదలకు నివాసం కల్పించడమే ప్రభుత్వ
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ తెలిపారు. బుధవారం సదాశివనగర్ మండలం మోడేగాం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఆయన పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. గత ఏడాది భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని లబ్ధిదారులు తెలిపారు.