నామినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి

5చూసినవారు
నామినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను సాధారణ పరిశీలకులు డి. ప్రశాంత్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థులు ఏయే ధ్రువీకరణ పత్రాలు జత చేయాలో స్పష్టంగా తెలియజేయాలని, ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే వెంటనే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you