ఆర్మూర్లో ఇటీవల జరిగిన ఘటనలకు మతరంగు రుద్దుతున్నారు.

0చూసినవారు
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశవ్ రెడ్డి కామారెడ్డి క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ, ఆర్మూర్ లో ఇటీవల జరిగిన ఘటనలకు మతరంగు పూస్తున్నారని ఆరోపించారు. గ్రామంలోని ఒక పాఠశాలలో హిందూ విద్యార్థులకు ఖురాన్, నమాజ్ నేర్పిస్తున్నారని, దీనిపై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రిన్సిపాల్ ను ప్రశ్నిస్తే అసహనం వ్యక్తం చేశారని, కొందరు విదేశీ సంస్థల నిధులతో హిందువులను మత మార్పిడులకు గురిచేయాలని కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రజలు మతపరమైన ఆవేశాలకు లోనుకాకుండా కలిసి ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్