కామారెడ్డి జిల్లాలో 2,571 మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారని, గత 19 ఏళ్లలో జిల్లాలో ఎయిడ్స్ కేసులు 5.25% నుంచి 0.4% తగ్గినట్లు HIV, AIDS కంట్రోల్ ప్రోగ్రాం అధికారిణి రాణి తెలిపారు. అర్హులైన 1,867 మంది రోగులకు రూ. 2016 పింఛను అందిస్తున్నామని, 15 మంది గర్భిణుల నుంచి పిల్లలకు వ్యాధి సోకకుండా చర్యలు తీసుకున్నామని ఆమె సోమవారం తెలిపారు. కామారెడ్డి, బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామని, ప్రజల్లో చైతన్యం తెస్తున్నామని ఆమె పేర్కొన్నారు.