ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 4వ వార్డుకు సంబంధించిన 2 పోలింగ్ బూత్ లను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ నెల 11న జరుగనున్న 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల రోజునే, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ప్రాక్టికల్ చివరి పరీక్ష ఉండటంతో, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, స్థానిక ఆర్డీఓ పార్థ సింహారెడ్డితో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4వ వార్డుకు కేటాయించిన 2 పోలింగ్ బూత్ లను పరిశీలించి, ఎన్నికల అధికారులకు సమస్యను వివరించారు.