ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఆంగ్లం సబ్జెక్టుకు 'సెట్-సీ' ప్రశ్నాపత్రాన్ని అధికారులు ఎంపిక చేశారు. మొత్తం 233 మంది విద్యార్థులకు గాను 230 మంది పరీక్షలకు హాజరయ్యారు, ముగ్గురు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.